Popular Producer Karan Johar Emotional : జాతీయ పుర‌స్కారం క‌ర‌ణ్ జోహార్ భావోద్వేగం

ఈసారి కూడా అవార్డు అందుకోవ‌డం ఆనందం

Hello Telugu - Popular Producer Karan Johar Emotional

Hello Telugu - Popular Producer Karan Johar Emotional

Karan Johar : ఢిల్లీ : జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డును అందుకోవ‌డం ప‌ట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్. గ‌త ఏడాదితో పాటు ఈఏడాది కూడా జాతీయ స్థాయిలో పుర‌స్కారం అందుకోవ‌డం ప‌ట్ల తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను దర్శకత్వం వ‌హించిన‌ తొలి చిత్రం కుచ్ కుచ్ హోతా హైకి అదే విభాగంలో నామినేట్ అయ్యారు. 2023లో తన “రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ” చిత్రానికి ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు క‌ర‌ణ్ జోహార్ (Karan Johar). తర్వాత చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తాను వినయంగా, గౌరవంగా, కృతజ్ఞతతో నిండి ఉన్నానని అన్నారు. కుచ్ కుచ్ హోతా హై, కల్ హో నా హై, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి విజయాలకు పేరుగాంచారు. ఈ సినిమాల‌కు క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌తో పాటు ద‌ర్శ‌కుడు కూడా.

Karan Johar Gets National Award

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ వేదిక‌గా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా క‌ర‌ణ్ జోహార్ అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌ను క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఈ పుర‌స్కారం త‌న ఒక్క‌డికి చెందిన‌ది కాద‌ని త‌న ఉన్న‌తి కోసం స‌హాయ స‌హ‌కారాలు అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ చెందుతుంద‌ని చెప్పారు . 71వ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రదానోత్సవంలో ఉత్తమ నటిగా సత్కరించబడిన రాణి ముఖర్జీతో ఉన్న ఫోటోలను జోహార్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అవార్డు అందుకోవ‌డం త‌న జీవితంలో మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు. అంతే కాకుండా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ ప్రధాన నటులు రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌లకు క‌ర‌న్ జోహార్ కూడా అభినందనలు తెలిపారు.

Also Read : Rahul Gandhi Shocking Comments : బీహార్ ఎన్నిక‌ల‌పై రాహుల్ గాంధీ ఫోక‌స్

Exit mobile version