Nara Lokesh: అమరావతిః తెలుగువారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తాము అండగా నిలబడతామని మరోసారి నిరూపించారు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). గతంలో ఉత్తరాఖండ్ వరదల సమయంలో చిక్కుకుపోయిన తెలుగువారిని నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా స్వరాష్ట్రానికి చేర్చారు. నేడు కూటమి ప్రభుత్వంలో నేపాల్ లో చిక్కుకు పోయిన చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి చేర్చి విజయవంతంగా ఆపరేషన్ నేపాల్ రెస్క్యూను మంత్రి నారా లోకేష్ పూర్తిచేశారు. నేపాల్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పలు ప్రాంతాల్లో బృందాలుగా ఏపీ యాత్రికులు చిక్కుకు పోయారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ లోని ప్రత్యేక వార్ రూమ్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.
Nara Lokesh Key Comment on Nepal Victims
ఇందుకోసం తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్ రూమ్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ నిరంతరం సమన్వయం చేశారు. ఫలితంగా నేపాల్ లో చిక్కుకున్న చిట్టచివరి వ్యక్తి వరకు రాష్ట్రానికి చేరుకోవడం సాధ్యమైంది. ఇదంతా మంత్రి కృషి వల్లనే జరిగిందనేది వాస్తవం . ఇదిలా ఉండగా నేపాల్ లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మొత్తం 361 మంది ఏపీ వాసులను రక్షించి ప్రత్యేక విమానాల ద్వారా వారందరినీ సురక్షితంగా మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి చేర్చారు. మంత్రి చొరవతో ఇప్పటికే 275 మందిని రాష్ట్రానికి రప్పించి వారందరినీ వారి వారి గమస్థానాలైన విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, తిరుపతికి చేర్చారు.
Also Read : KTR Shocking Comments : అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదు
















