Minister Nara Lokesh Important Meet : కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర‌ ప్ర‌ధాన్ తో లోకేష్ భేటీ

బీహార్ లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీ రోల్

Hello Telugu - Minister Nara Lokesh Important Meet

Hello Telugu - Minister Nara Lokesh Important Meet

Nara Lokesh : బీహార్ : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కేంద్ర మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చార క‌న్వీన‌ర్ ధ‌రేంద్ర ప్ర‌ధాన్ తో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య వివిధ కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. బీహార్ లో ఎన్డీఏ విజయం కోసం శ్రమిస్తున్న ప్రధాన్ కృషిని మంత్రి లోకేష్ (Nara Lokesh) అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి స‌ర్కార్ ప‌ట్ల ప్ర‌జ‌లు మ‌రింత న‌మ్మ‌కంతో, విశ్వాసంతో ఉన్నార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో 12 సార్ల‌కు పైగా ప‌ర్య‌టించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న‌తో పాటు బీజేపీ ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కూడా ప్ర‌చారం చేప‌ట్టారు. ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు.

IT Minister Nara Lokesh Important Meet

ఈ సంద‌ర్బంగా కూట‌మి స‌ర్కార్ లో కీల‌క భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం పార్టీ. ఈ కీల‌క స‌మ‌యంలో బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాలుపంచు కునేందుకు ఇక్క‌డికి వ‌చ్చారు. రాష్ట్ర రాజ‌ధాని పాట్నా న‌గ‌రానికి విచ్చేసిన లోకేష్ కు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు. ఈ సంద‌ర్బంగా బీహార్ లోని ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కీల‌క భేటీలో పాల్గొన్నారు. ఏపీ ఏ విధంగా అభివృద్ది వైపు దూసుకు పోతుందోన‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. వారికి అర్థం చేయించే ప్ర‌య‌త్నం చేశారు నారా లోకేష్‌.

Also Read : K Kavitha Strong Demand : క‌ల్వ‌కుంట్ల క‌విత చాయ్ పే చ‌ర్చ

Exit mobile version