Nara Lokesh Strong Focus : పెండింగ్ ప్రాజెక్టులపై నారా లోకేష్ ఫోక‌స్

రేపు కేంద్ర మంత్రుల‌తో భేటీ కానున్న మంత్రి

Hello Telugu - Nara Lokesh Strong Focus

Hello Telugu - Nara Lokesh Strong Focus

Nara Lokesh : అమరావతి: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి లోకేష్ సోమవారం ఈమేరకు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయిన లోకేష్ (Nara Lokesh) రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల రాకతోపాటు వేగవంతంగా అనుమతులు మంజూరు అవుతున్నాయి. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపేందుకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

Minister Nara Lokesh Key Comments

రేపటి పర్యటనలో రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ ఈ సంద‌ర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జల రవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో మంత్రి లోకేష్ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు అందజేస్తారని టీడీపీ వెల్ల‌డించింది.

Also Read : Rahul Gandhi Shocking Comments : ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించేందుకే మా పోరాటం

Exit mobile version