Nara Lokesh : అమరావతిః కూటమి ప్రభుత్వంలో 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడుని అందించామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్య లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలను ఫీజు నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోందా అని మండలిలో కుడిపూడి సూర్యనారాయణ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఏపీఎస్ఆర్ఎంసీ చట్టాన్ని 2019లో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ను ప్రైమరీ స్కూళ్లలో అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు లోకేష్. 117 జీవో వల్ల కేవలం 1200 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో సుమారు 9,600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ను అందజేశాం అని వెల్లడించారు.
Minister Nara Lokesh Praises Chaganti Koteswara Rao
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను మోటివేట్ చేస్తున్నాం. లెర్నింక్ అవుట్ కమ్స్ పై శ్రద్ధ పెడుతున్నాం. విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు కోసం చర్యలు చేపట్టాం. చాగంటి కోటేశ్వరరావు ని సలహాదారుగా నియమించాం అన్నారు. ఆయన రూపొందించిన పుస్తకాలను ప్రింట్ చేసి విద్యార్థులకు అందిజేస్తున్నాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు ని అభినందించాలి. ఆయన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోవడం లేదని అన్నారు. నేను ఆశ్చర్యపోయా. కనీసం ప్రభుత్వం నుంచి ఫోన్ కూడా తీసుకోలేదు. వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం లేదు. అద్భుతమైన పుస్తకాలను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ను తీసుకువస్తాం. న్యాస్ నివేదికను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు లోకేష్.
Also Read : BC Janardhan Reddy Interesting Updates : 352 వంతెనల నిర్మాణానికి రూ. 1430 కోట్లు
