Nara Lokesh Important Comments : నితీష్ కుమార్ స‌మ‌ర్థ‌త‌తో బీహార్ రాష్ట్రాభివృద్ది

సాధ్య‌మైంద‌న్న ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్

Hello Telugu - Nara Lokesh Important Comments

Hello Telugu - Nara Lokesh Important Comments

Nara Lokesh : బీహార్ : సమర్థవంతమైన నాయకుడైన నితీష్ కుమార్ వల్ల బీహార్ అన్ని రంగాల‌లో అభివృద్ధి సాధిస్తోందని స్ప‌ష్టం చేశారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh). ఆదివారం ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనేందుకు బీహార్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా బీహార్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇదే కొన‌సాగింపును బీహార్ కూడా కొన‌సాగిస్తుంద‌ని చెప్పారు. ఈసారి కూడా బీహార్ రాష్ట్ర ప్ర‌జ‌లు మూకుమ్మ‌డిగా ఎన్డీయే స‌ర్కార్ కు ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో స‌మ‌ర్త‌వంత‌మైన నాయ‌కులు ఉన్నార‌ని అందుకే అభివృద్ది సాధ్య‌మ‌వుతోంద‌ని అన్నారు నారా లోకేష్.

IT Minister Nara Lokesh Key Comments on CM Nitish Kumar

ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం కావ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగించింద‌ని చెప్పారు. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని స్ప‌ష్టం చేశారు. దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారని అన్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్ప‌డింద‌ని చెప్పారు నారా లోకేష్. అదేవిధంగా బీహార్ కూడా నితీష్ కుమార్ కు ముందు, తర్వాత కీల‌క‌మైన రంగాల‌లో ముఖ్య‌మైన పాత్ర పోషిస్తోంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడూ సుస్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని, అంత‌కు మించి స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని కోరుకుంటార‌ని ఆ రెండూ బీహార్ లో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

Also Read : Harish Rao Fired on CM Revanth Reddy : గాడి త‌ప్పిన రేవంత్ పాల‌న : హ‌రీష్ రావు

Exit mobile version