Harish Rao Fired on CM Revanth Reddy : గాడి త‌ప్పిన రేవంత్ పాల‌న : హ‌రీష్ రావు

హామీలు గాలికి వ‌దిలేశార‌ని ఆరోప‌ణ

Hello Telugu - Harish Rao Fired on CM Revanth Reddy

Hello Telugu - Harish Rao Fired on CM Revanth Reddy

Harish Rao : హైద‌రాబాద్ : రాష్ట్రంలో బుల్డోజ‌ర్ పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఎర్రగడ్డ మోతీనగర్‌లోని వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజర‌య్యారు. తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు ఉండేవ‌న్నారు. రాష్ట్రం వ‌స్తే తాగేందుకు నీళ్లుండ‌వ‌ని, విద్యుత్ బంద్ అవుతుంద‌ని కారుకూత‌లు కూశార‌ని అన్నారు. అంతే కాదు వారికి పాల‌నే చేత కాదంటూ ఎద్దేవా చేశార‌ని, కానీ చివ‌ర‌కు కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలోనే తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్ చేశామ‌న్నారు. దీంతో విమ‌ర్శించిన వాళ్లు విస్తు పోయేలా అభివృద్ది చేసి చూపించామ‌న్నారు. కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన అభివృద్దిని, రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప‌ని చేస్తున్నారంటూ వాపోయారు హ‌రీశ్ రావు (Harish Rao).

Harish Rao Slams CM Revanth Reddy

కాగా గ‌త పది సంవత్సరాల పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్న నానుడిని మార్చి తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరించేలా చేసిన ఘ‌న‌త మాజీ సీఎం కేసీఆర్ కు ద‌క్కింద‌న్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. శుద్ధి చేసిన మంచినీళ్లను ప్రతి ఇంటికి అందించక పోతే తాను ఓటే అడగను అని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు హ‌రీశ్ రావు. ఎంతోమంది నాయకులు పాలించారు కానీ ఎవరు కూడా కనీసం తాగునీరు అందించిన పాపాన పోలేద‌న్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, మోడీ ఆదర్శంగా తీసుకొని హర్ ఘర్‌కు జల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

Also Read : Tejashwi Yadav Shocking Comments : బీహార్ ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నారు

Exit mobile version