Minister Nara Lokesh Important Update : డేటా సెంటర్లకు త‌క్కువ ఖ‌ర్చుతో విద్యుత్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్

Hello Telugu - Minister Nara Lokesh Important Update

Hello Telugu - Minister Nara Lokesh Important Update

Nara Lokesh : విశాఖ‌ప‌ట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ రాష్ట్రం అన్ని రంగాల‌లో అభివృద్ది దిశగా దూసుకు వెళ్తోందని చెప్పారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh). విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా జ‌రిగిన సీఐఐ స‌మ్మిట్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌ధానంగా విద్యుత్ రంగంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 6 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకు రావాలని ఆలోచన చేశామ‌ని అన్నారు. ఇప్పుడది సాకారం అయ్యిందని చెప్పారు. దీనికి ప్ర‌ధాన కార‌కుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అని అన్నారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని లేక పోతే క‌ష్టంగా ఉండేద‌న్నారు. కాగా ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయటం ఓ సవాలు అని చెప్పారు.

IT Minister Nara Lokesh Comments

అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే ఖర్చులు పెరిగి పోతాయని అన్నారు. అందుకే ఆధునిక టెక్నాలజీలపై ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు వాటిని నిజం చేస్తున్నారని పేర్కొన్నారు లోకేష్. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పని చేస్తుంద‌ని చెప్పారు. సీఎం ఆలోచన చేస్తే దానిని తక్షణం అమలు చేయాలని ఆదేశిస్తారు. అందుకే మంత్రులుగా మేమూ.అధికారులు అంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని అన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నానని లోకేష్ చెప్పారు.

Also Read : CM Chandrababu Clear Instructions : ఇంధన రంగంలో సైబర్ రక్షణ అత్యవసరం

Exit mobile version