అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధిగా, మరో వైపు నటుడిగా, ఇంకో వైపు యాంకర్ గా, ఇంకో వైపు బసవ తారకం ఆస్పత్రి చైర్మన్ గా ఇలా పలు విధాలుగా తనకు తోచిన రీతిలో విశిష్ట సేవలు అందిస్తున్నాడని తన బావ మరిది నందమూరి బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఏపీలో ప్రివెంటివ్, క్యూరెటివ్, ప్రిడిక్టివ్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు పబ్లిక్ హెల్త్ రంగంతో పాటు… లాభాపేక్ష లేని ఆస్పత్రులు కూడా వస్తే పేదలకు వైద్య సేవలు మెరుగ్గా అందుతాయి. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రుల లాంటి లాభాపేక్ష లేని ఆస్పత్రులు మరిన్ని రావాల్సి ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఆయన ఆశయ సాధన కోసం రాజకీయంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి, ఆయన కుమార్డు బాలయ్య ఇద్దరూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తల్లి పేరుతో బాలయ్య బసవ తారకం ఆస్పత్రి ద్వారా సేవలు అందిస్తోంటే ఎన్టీఆర్ కుమార్తె తండ్రి పేరుతో ఎన్టీఆర్ ట్రస్టు పెట్టి విద్యా, వైద్య సేవలు అందిస్తున్నారు. తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు సేవలు అందించే కుటుంబం మరోకటి లేదు. పేదలకు సేవ చేసిన ఆనందం మరెందులోనూ లేదు. బాలకృష్ణ, భువనేశ్వరి అందిస్తోన్న సేవల్ని అభినందిస్తున్నాన అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియా పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ, తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రులు సత్యకుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, భరత్, ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.















