బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ లో కొలువు తీరిన కొందరు కేంద్ర మంత్రుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కేబినెట్ లో మంత్రిగా ఉన్న నాగేంద్రను తొలగించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ లు ఆందోళన చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులపై కేసులు ఉన్నాయని, మరి వారు ఎందుకు తప్పుకోవడం లేదంటూ , తమ పదవులకు రాజీనామాలు ఎందుకు చేయడం లేదంటూ నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, కేంద్ర మంత్రిగా ఉన్న మాజీ సీఎం జేడీ కుమార స్వామిని. కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలందరినీ శివకుమార్ క్రమశిక్షణ కలిగిన సైనికులుగా అభివర్ణించారు. కర్ణాటక దళిత వాల్మీకి కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో చిక్కుకున్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు.
ఈ నిర్ణయం సరైన ప్రక్రియను అనుసరించే తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి చెందిన అనేక మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ, ఆ పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చాలా మంది కేంద్ర మంత్రులపై కేసులు ఉన్నాయి. మరి వారి విషయంలో ఎందుకు నోరు మెదపలేదు? నాగేంద్ర విషయంలో అయితే సిద్ధరామయ్య ,నేను చర్చించి ఆయన రాజీనామాను తీసుకున్నామని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఆయన మంత్రివర్గానికి దూరంగానే ఉన్నారని చెప్పారు. అతను ఎక్కడా తప్పులో భాగం కాలేదని మా అధికారుల విభాగం నుండి నివేదిక వచ్చింది, అందుకే తాము నాగేంద్రను కేబినెట్ లోకి తీసుకున్నామని స్పష్టం చేశారు సీఎం డీకే శివకుమార్. కాగా 2024లో ఈ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నాగేంద్ర అప్పట్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2026లో తిరిగి మంత్రివర్గంలోకి చేరారు.
















