Nag Ashwin : హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశ ప్రధాన మంత్రికి జీఎస్టీ స్లాబ్ రేట్స్ ను సినిమా రంగానికి కూడా వర్తించేలా చూడాలని కోరారు. ఇందులో భాగంగా సినిమా టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గించాలని సూచించారు. దీని వల్ల మరింతగా సినిమాలను చూసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ప్రత్యేకించి సినిమా టిక్కెట్లపై తక్కువ జీఎస్టీ విధించాలని ప్రధాని మోదీని నాగ్ అశ్విన్ అభ్యర్థించారు . ఇదే సమయంలో తాజగా కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు స్లాబ్ రేట్లను నాలుగు విభాగాలలో పన్ను వసూలు చేసింది.
Nag Ashwin Requests
పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో అన్ని వస్తువులను రెండు స్లాబ్ రేట్స్ గా విభజించింది కౌన్సిల్. కాగా ప్రభుత్వం సరళీకృత రెండు-స్లాబ్ జీఎస్టీ వ్యవస్థను ప్రకటించడాన్ని స్వాగతించారు దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి చిత్ర నిర్మాత , దర్శకుడిగా గుర్తింపు పొందారు. రూ. 250 వరకు ధర ఉన్న టిక్కెట్లకు 5 శాతం జీఎస్టీని విస్తరించాలని కోరారు. ప్రస్తుతం తను కల్కి 2898 ఏడీ సీక్వెల్ తీసే ప్రయత్నం లో ఉన్నారు. సినిమా టికెట్ ధరలను జీఎస్టీ స్లాబ్ కిందకు తీసుకు రావాలని సూచించారు నాగ్ అశ్విన్.. ఇదే సమయంలో ఈ రోజుల్లో చాలా తక్కువ థియేటర్లు రూ. 100 వసూలు చేస్తాయని తెలిపారు. మధ్యతరగతి ప్రేక్షకులను నిమగ్నం చేస్తూ మన పరిశ్రమ , థియేటర్లు పెరగాలంటే తగ్గంచడం చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : Donald Trump Interesting Comments : భారత దేశం అమెరికా మధ్య విడదీయని బంధం
