Nabard : గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం నాబార్డ్ రాష్ట్రాలకు రూ.1.59 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23 నుండి 2024-25 వరకు) గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1.59 లక్షల కోట్లకు పైగా రుణ సహాయం అందించిందని ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఈ మొత్తంలో రూ.1.23 లక్షల కోట్లు నాబార్డ్ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (RIDF) ద్వారా పంపిణీ చేయగా, మిగిలిన రూ.36,439 కోట్లు ఆర్థిక సంస్థకు సంబంధించిన ఇతర పథకాల కింద ఇవ్వడం జరిగిందన్నారు.
Nabard Allocates
వీటిలో నాబార్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సహాయం (ఎన్ఐడీఏ), రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల సహాయం (ఆర్ఐఏఎస్), దీర్ఘకాలిక నీటిపారుదల నిధి (ఎల్టీఐఎఫ్), మైక్రో ఇరిగేషన్ నిధి (ఎంఐఎఫ్), ఫుడ్ ప్రాసెసింగ్ నిధి (పీపీఎఫ్), వేర్‌హౌస్ మౌలిక సదుపాయాల నిధి (డబ్ల్యూఐఎఫ్) , మత్స్య, ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (FIDF) ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ పథకాల ద్వారా నాబార్డ్ అందించే నిధుల మద్దతు గ్రామీణ మౌలిక సదుపాయాలను – రోడ్లు, నీటిపారుదల , నిల్వ సౌకర్యాలను పెంచుతుందన్నారు.ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదకతను , మెరుగైన మార్కెట్ ప్రాప్యతకు దోహద పడేలా చేస్తుందన్నారు.
గ్రామీణ రుణగ్రహీతలు రుణాన్ని సమర్థవంతంగా గ్రహించి ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుందని సీతారామన్ వివరించారు. కాగా సంస్థాగత వనరుల నుండి రుణం పొందుతున్న వ్యవసాయ కుటుంబాల నిష్పత్తి 2016-17లో 60 శాతం నుండి 2021-22లో 75 శాతానికి పెరిగిందని ఆర్థిక మంత్రి సీతారామన్ ఎత్తి చూపారు . నాబార్డ్ వివిధ పథకాల కింద ఇప్పటివరకు 6215 రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOలు) ఏర్పాటును ప్రోత్సహించిందని కూడా ఆమె హైలైట్ చేశారు.
Also Read : GST Evasion Updates : గత 5 ఏళ్లలో రూ. 7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
