చెన్నై : పాలనా పరంగా తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే విద్యా వ్యవస్థకు చికిత్స చేయడం ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రేమ చెల్లించాలని ఆదేశించారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త, ‘మూన్ మ్యాన్ గా పేరు పొందిన డాక్టర్ మైల్స్వామి అన్నదురైకి కీలక పదవిని కట్టబెట్టారు. ఆయనను రాష్ట్ర పాఠ్యప్రణాళిక రూపకల్పన కమిటీ ఛైర్మన్‌గా నియమించారు సీఎం . చంద్రయాన్, మంగళ్‌యాన్ వంటి చారిత్రాత్మక అంతరిక్ష యాత్రలకు నాయకత్వం వహించారు మాజీ సైంటిస్ట్. ఆయన ఇప్పుడు 1.3 కోట్లకు పైగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టనున్నారు.
17 మంది సభ్యులతో కూడిన ఈ నిపుణుల కమిటీ పాఠ్యప్రణాళికలో సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. పాఠశాల పాఠ్యప్రణాళిక మరియు సిలబస్‌ను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చొరవలో భాగంగా నవంబర్ 2025లో పాఠ్య ప్రణాళిక రూపకల్పన కమిటీని ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖ జారీ చేసిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) ప్రకారం 16 మంది సభ్యుల కమిటీని పునర్ వ్యవస్థీకరించింది. ఈ ఉత్తర్వులో అన్నాదురైని దాని ఛైర్‌పర్సన్‌గా నియమించగా, మిగిలిన సభ్యులను యథాతథంగా కొనసాగించారు.
ఇదిలా ఉండగా ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, కోయంబత్తూర్‌లోని ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివారు. పాఠ్య ప్రణాళిక సవరణను పర్యవేక్షించేందుకు, పాఠశాల విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ది న్యూ కాలేజీలోని జంతుశాస్త్ర విభాగం మాజీ అధిపతి, రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు అయిన సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్‌ను పాఠ్య ప్రణాళిక రూపకల్పన కమిటీకి మొదటి ఛైర్‌పర్సన్‌గా నియమించారు.
















