అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం 45 రోజుల పాటు ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుందనని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు, సోమవారం నుండి పాటు ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి మూడు పార్టీల కూటమి నాయకులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులు , ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, కూటమి 57 శాతం ఓట్లతో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని నాయుడు గుర్తు చేశారు. YSR కాంగ్రెస్ ప్రభుత్వం 151 అసెంబ్లీ స్థానాల నుండి కేవలం 11 స్థానాలకు పడి పోవడానికి ఆ పార్టీ “తప్పుడు విధానాలు , పాలనా వైఫల్యాలే” కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు , సంక్షేమ ప్రాధాన్యతల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వం ఇప్పుడు ప్రజల కేంద్రంగా పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని నాయుడు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. బూత్ కన్వీనర్లు, పార్టీ కమిటీలు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని, పార్టీ కార్యకర్తలు , ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, అలాగే బలవంతంగా కాకుండా ఉత్సాహంతో పని చేయాలని ఆయన సూచించారు. మనకు అనుచరులు కాదు, నాయకులు కావాలి అని అన్న నాయుడు, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని , విశ్వాసాన్ని పొందాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎన్నికల ప్రచార సమయంలో మాదిరిగానే ప్రతి ఇంటినీ సందర్శించి, కూటమి ప్రభుత్వం తన హామీలను ఎలా నెరవేరుస్తోందో , సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తోందో వివరించాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
















