ముంబై : బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్ ఇవాళ 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వేలాది మంది తనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తన విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్న బాద్ షా కు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఖాన్ ద్వయం ఏలుతూ వచ్చింది. వారిలో అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్. తాజాగా ఆయన కింగ్ మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు. గతంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటించాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. షారుక్ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు వేలాదిగా ఆయన నివాసం వద్దకు తరలి వచ్చారు. ఒక భారీ ప్రొజెక్టర్ ఆయన చేతితో రాసిన సందేశాన్ని ప్రదర్శించి, అభిమానులకు ఒక ప్రత్యేక పుట్టినరోజు ఆశ్చర్యాన్ని అందించింది.
మీ అందరి శుభాకాంక్షలకు, ప్రేమకు ధన్యవాదాలు. నా ప్రేమను కూడా మీ అందరికీ తిరిగి పంపుతున్నాను అని ఆ సందేశంలో ఉంది. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర నిర్మాతలు ఆయన రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్’ నుండి కొన్ని దృశ్యాలను కూడా పంచుకున్నారు. అభిమానులకు సినిమాపై ఒక చిన్న అవగాహనను అందించారు. బయట గుమిగూడిన అతని అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతూ “కింగ్ అకేలా కాఫీ హై” “డర్ నహీ, దెహషత్ హూ” అనే రెండు సంభాషణలను ప్రొజెక్షన్లపై ప్రదర్శించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘కింగ్’ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. 2023లో థియేటర్లలో విడుదలైన ‘పఠాన్’ చిత్రంలో కలిసి పనిచేసిన తర్వాత ఈ చిత్రంతో ఆనంద్‌తో షారుఖ్ మళ్లీ జతకట్టారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
