తిరువనంతపురం : ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా గెలవడం సంతోషంగా ఉందన్నాడు సంజు శాంసన్ తండ్రి విశ్వనాథన్ శాంసన్. తన కొడుకు టోర్నీ గెలుపొందిన అనంతర భార్య చారులతతో కలిసి తిరువనంతపురంకు చేరుకున్నాడు. ఈ సందర్బంగా వేలాది మంది తనకు స్వాగతం పలికారు. ఇదే క్రమంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యా శాఖ మంత్రి శివాని శెట్టి స్వాగతించారు. ఇదిలా ఉండగా తన కొడుకు శాంసన్ ఆట తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు తండ్రి విశ్వనాథన్ శాంసన్.
తను జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు జట్టుకు ప్రాధాన్యతనిచ్చే వైఖరి , దృఢత్వాన్ని ప్రశంసించారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కొడుకు దేశం కోసం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అది నాకు నిజంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నాడు విశ్వనాథన్ శాంసన్. నేను ఎప్పుడూ అతను ఈ విధంగా ఆడాలని, సెంచరీల కోసమో లేదా వ్యక్తిగత రికార్డుల కోసం కాదు, జట్టు కోసం, జట్టు మనిషిగా ఉండి జట్టు గెలవడానికి సహాయం చేయాలని కోరుకున్నానని తెలిపాడు. జట్టుకు బలమైన పునాదిని నిర్మించడమే ముఖ్యం అన్నాడు. సంజు శాంసన్ సరిగ్గా అదే చేసాడని తెలిపాడు.
