గౌతం గంభీర్ తో బంధం శాశ్వ‌త‌మైన‌ది

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్

hellotelugu-sanjusason

న్యూఢిల్లీ : స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు మ‌ధ్య ఉన్న బంధం గురించి పంచుకున్నాడు. ఈ బంధం ఈనాటిది కాద‌ని కొన్నేళ్ల నుంచి కొన‌సాగుతూ వ‌స్తోంద‌ని చెప్పాడు. నాకు, గౌతీ భాయ్ కి చాలా కాలంగా సంబంధం ఉంది. అతను జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను అతన్ని కేకేఆర్ మేనేజ్మెంట్ తో కలిశాను. అతను ఢిల్లీలో నివసిస్తున్నాడు. నేను కూడా అతను ఉన్న అకాడమీలోనే ఆడాను. అతను కోచ్ అయినప్పుడు కూడా కాదు, అతను భారత జట్టుకు ఆడుతున్నప్పుడు నేను అతనితో టచ్ లో ఉండేవాడినని చెప్పాడు సంజు శాంస‌న్. నేను ఇంకా ఏమి చేయాలో అతనితో మాట్లాడతానన‌ని అన్నాడు.

ఇది చాలా కాలంగా ఉన్న బంధం అని చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో నేను స‌ర్వ‌శ‌క్తులు కేంద్రీక‌రించ‌డం జ‌రిగింది. నా ముందున్న‌ది ఒకే ఒక క‌ల‌. నేను వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడాలి. అంతే కాదు భార‌త దేశానికి క‌ప్ ను అందించాల‌ని. దానిని నేను గుర్తించాను. మేర‌కు నేను ఆడుకుంటూ పోయాన‌ని చెప్పాడు. ఏనాడూ వ్య‌క్తిగ‌త రికార్డుల‌ను ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాక గౌతం భాయ్ నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. న‌న్ను ఆలింగ‌నం చేసుకున్నాడు. ఆపై న‌న్ను అభినందించాడు. ఈ క్ష‌ణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు.

Exit mobile version