Murugadoss : తమిళ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకులలో మురుగదాస్ (Murugadoss) ఒకరు. తను ఇటీవల సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్ బోల్తా పడింది. ఈ సందర్బంగా అందరూ తనను ట్రోల్ చేయడం, విమర్శలకు గురి చేయడం పట్ల మండిపడ్డాడు. ఆపై సంచలన ఆరోపణలు చేశాడు నటుడు ఖాన్ పై. తన కారణంగానే సినిమా ఆశించిన మేర రాలేదన్నాడు. తను షూటింగ్ కు ఎప్పుడు వస్తాడో తెలియక నానా తంటాలు పడ్డామని, అందుకే బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర స్పందన రాలేదన్నాడు. ఈ తరుణంలో ఉన్నట్టుండి తను నిర్మాతగా మారాడు. అదే మదరాసి సినిమా. ప్రత్యేకించి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శివ కార్తికేయన్.
Murugadoss Key Comments on Madharaasi Movie
ఈ సినిమా సెప్టెంబర్ 5న ఐదు భాషలలో విడుదల చేశారు. మిశ్రమ స్పందన లభించింది. కథ పరంగా ఆలోచించేలా చేసినా ఎందుకనో నడపడంలో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ పెట్టిన డబ్బులు వచ్చినట్లు సమాచారం . ఇది పక్కన పెడితే మంగళవారం ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అది ఏమిటంటే మదరాసి మూవీ వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని తెలిపారు నిర్మాత, దర్శకుడు ఏఆర్ మురుగదాస్. కాగా సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో విడుదలవుతోంది, ఇది వివిధ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రంలో బిజు మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్ వంటి స్టార్ తారాగణం నటించారు.
Also Read : ED Shocking Chhattisgarh CM Son : లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కొడుకు కీలకం
