Mukesh Ambani : ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆయుర్వేద రంగంలోకి ప్రవేశించింది. రిలయన్స్ రిటైల్‌కు అనుబంధంగా ఉన్న బ్యూటీ ప్లాట్‌ఫామ్ ‘తీరా’ తాజాగా ‘పురవేద’ అనే నూతన బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సంప్రదాయ ఆయుర్వేదాన్ని ఆధునిక పరిజ్ఞానంతో మేళవించిన ఈ బ్రాండ్ ద్వారా చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ, శరీర సంరక్షణకు సంబంధించిన పలు ఉత్పత్తులను వినియోగదారులకు అందించనుంది.
Mukesh Ambani – భారతీయ వారసత్వానికి నూతన దోహదం
తీరా సహ వ్యవస్థాపకురాలు మరియు సీఈఓ భక్తి మోడీ మాట్లాడుతూ: “పురవేద బ్రాండ్ ప్రారంభం మా ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఇది భారతీయ సంప్రదాయాల విశిష్టతను ఆధునికతతో మిళితం చేస్తుంది. తీరా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, అందానికి మించి, సమగ్ర స్వీయ సంరక్షణను ప్రోత్సహించే ఉత్పత్తులను అందించాలన్నదే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
నాలుగు ప్రత్యేక శ్రేణులు – ధర, నియమం, సామ, ఉర్జా
పురవేద (Puraveda) ప్రారంభ దశలో నాలుగు విభిన్న శ్రేణులలో 50 కంటే ఎక్కువ ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ శ్రేణుల పేర్లు ‘ధర’, ‘నియమం’, ‘సామ’, ‘ఉర్జా’గా ఉంచారు. ఆయుర్వేద సూత్రాలు ఆధారంగా రూపొందించిన ఈ ఉత్పత్తులు సంప్రదాయ పదార్థాలను ఉపయోగించినప్పటికీ, ఆధునిక అవసరాలను తీర్చేలా తయారు చేశారు.
తీరా విస్తరణ పథంలో
2023లో ప్రారంభమైన తీరా ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98% పిన్‌కోడ్‌లకు సేవలు అందిస్తోంది. నగరాలలో అనేక ఫిజికల్ స్టోర్లతో పాటు, ఆన్‌లైన్‌లో కూడా తీరా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తీరా అధికారిక వెబ్‌సైట్ లేదా షాప్‌ల ద్వారా పురవేద ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
పోటీగా మారిన ఆయుర్వేద మార్కెట్
ఈ అడుగుతో రిలయన్స్ ఆయుర్వేద రంగంలో ఇప్పటికే ఉన్న పతంజలి, హిమాలయ వంటి ప్రముఖ బ్రాండ్లకు పోటీగా నిలవనుంది. బ్యూటీ మరియు స్వీయ సంరక్షణ విభాగంలో రిలయన్స్ పెట్టిన ఈ అడుగు, మార్కెట్‌లో కొత్త పోటీ వాతావరణాన్ని సృష్టించనుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
Also Read : Indian Stock Market Sensational : భారతీయ స్టాక్ మార్కెట్లపై బాంబు పేల్చిన ట్రంప్
