Harish Rao : సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు తప్పా ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు . రాబోయే రోజుల్లో అవినీతికి, అభివృద్దికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పాలన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు హరీష్ రావు . నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయని, కానీ మన సమావేశానికి మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదన్నారు.కొల్లూరు డబుల్ బెడ్ రూంలకు పేరు కేసీఆర్ నగర్ అనే పేరు పెట్టుకున్నామన్నారు. ఇన్ని ఇళ్లు చూసి అబ్బ కేసీఆర్ ఇంత పెద్ద ఇల్లు కట్టాడా? అని ఆశ్చర్య పోయారట అని అన్నారు.
Ex Minister Harish Rao Slams CM Revanth Reddy
ఏనాడైనా ఇక్కడికి మంత్రులు వచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. మాగంటి గోపీనాథ్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.మీ కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే భార్యలు ఏడుస్తారా లేదా అని నిలదీశారు. ఆ తల్లిని పట్టుకుని దుర్మార్గంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలోచన చేయాలని, సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు. ఇప్పటికే 420 హామీలతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచి పోతే ఎలా అని పేర్కొన్నారు.
Also Read : Hydraa Huge Save : ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రా
