MS Dhoni Growth : టీమిండియా మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?

మాజీ కెప్టెన్ ను సంప్ర‌దించిన బీసీసీఐ

Hello Telugu - MS Dhoni Growth

Hello Telugu - MS Dhoni Growth

MS Dhoni : ముంబై – భార‌త జ‌ట్టుకు కీల‌క‌మైన విజ‌యాల‌ను అందించిన నాయ‌కుడిగా పేరు పొందిన మ‌హేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మెంటార్ గా ఉండ‌నున్నాడా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది క్రికెట్ వ‌ర్గాల నుంచి ఇప్ప‌టికే బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టాలెంట్ క‌లిగిన ఆట‌గాళ్ల‌తో ఆసియా కప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ఖ‌రారు చేసింది. ఈ జట్టుకు స్కిప్ప‌ర్ గా సూర్య కుమార్ యాద‌వ్ ను, ఉప నాయ‌కుడిగా శుబ్ మ‌న్ గిల్ ను ప్ర‌క‌టించింది. అయితే విచిత్రంగా అంత‌గా అనుభ‌వం లేని గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎందుకు ఎంపిక చేశారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

MS Dhoni As a Team India Mentor?

ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం బీసీసీఐ ఫోక‌స్ అంతా ఆసియా క‌ప్ పై ప‌డింది. ఎలాగైనా స‌రే ఇండియా ఆ క‌ప్ ను ఎగ‌రేసుకు రావాల‌ని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా జ‌ట్టుకు కీల‌క‌మైన స‌మ‌యాల్లో మెంటార్ గా సీనియ‌ర్ ఆట‌గాడిని నియ‌మించాల‌ని అనుకుంటోంది. ఈ మేర‌కు మ‌హేంద్ర సింగ్ ధోనీని సంప్ర‌దించిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో జార్ణండ్ డైన‌మెట్ ప్ర‌పంచ క‌ప్ విజేత కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భార‌త జ‌ట్టుకు మెంటార్ గా ప‌ని చేశాడు. అయితే ఆ టోర్నీలో పాకిస్తాన్ చేతిలో భార‌త్ ఘోర‌మైన ప‌రాభవాన్ని చ‌వి చూసింది. మెన్ ఇన్ బ్లూ నాకౌట్ దశకు అర్హత సాధించలేదు. అయితే ఇప్ప‌టికే హెడ్ కోచ్ గా ఉన్న గంబీర్ మెంటార్ గా కంటే శిక్ష‌కుడిగా ఉండేందుకే మొగ్గు చూపిన‌ట్లు టాక్.

Also Read : Minister Nara Lokesh Important Invitation : మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం

Exit mobile version