రైతును హేళ‌న చేసిన ఎమ్మార్వో స్వామిపై వేటు

స‌స్పెండ్ చేసిన సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్

hellotelugu-GajwelMRO

సిద్దిపేట జిల్లా : ఇంకా బతికే ఉన్నావా..? అంటూ రైతుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన గజ్వేల్ ఎంఆర్ఓ స్వామి పై వేటు ప‌డింది. ఇందుకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. దీంతో ఈ ఘటన తర్వాత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులను విచారణ జరపాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా స్వామిని సస్పెండ్ చేశారు. సదరు అధికారి ప్రవర్తన అనుచితంగా ఉందని ప్రాథమిక విచారణలో తేలడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా భూ వివాదంపై తన కార్యాలయానికి వచ్చిన రైతు పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గజ్వేల్ తహసీల్దార్ స్వామి సస్పెండ్ అయ్యారు. ఆ అధికారి ప్రవర్తన సరిగా లేదని ప్రాథమిక విచారణలో స్ప‌ష్ట‌మైంది. పూర్తి నివేదిక‌ను క‌లెక్ట‌ర్ కు స‌మ‌ర్పించారు.

సమాచారం ప్రకారం భూమికి సంబంధించిన సమస్యపై సదరు రైతు గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సంభాషణ సమయంలో తహసీల్దార్ ఆ రైతును ఎగతాళి చేశాడు. ఏయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇంకా పురుగుల మందు తాగలేదా? అని అడిగారు. ఆ వ్యాఖ్య పట్ల రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్దేశ పూర్వకంగానే అలా అన్నారా అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. దానికి ఆ అధికారి అవును, అన్నాను. కచ్చితంగా అన్నాను అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఘటన తర్వాత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో విచారణ జరిపించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా స్వామిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా స్వామి ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదు. వీడియో వైరల్ అయిన తర్వాత ఆ రైతు యేసు మరో వీడియోను విడుదల చేస్తూ ఈ ఘటన నాలుగు లేదా ఐదు నెలల క్రితమే జరిగిందని పేర్కొన్నారు.

Exit mobile version