MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి

Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు క‌ల‌క‌లం రేపుతోంది. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఈ కేసులో ప‌లువురు ప్ర‌ముఖులు బాధితులుగా మారారు. దీనిపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తీగ లాగితే డొంకంతా క‌దిలిన‌ట్లు విచార‌ణ‌లో సంచనాలు వెలుగు చూస్తున్నాయి. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 4 వేల‌కు పైగా ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేసిన‌ట్లు గుర్తించారు.

MP Vishweswar Reddy Shocking Comments on Phone Tapping

ఈ మేర‌కు ఈ కేసులో కీల‌క‌మైన పాత్ర పోషించిన సీఐబీ మాజీ ఛీఫ్ ప్ర‌భాక‌ర్ రావుతో పాటు ప్ర‌ణీత్ రావును ప్ర‌శ్నించారు. ఆయ‌న నిర్వాకంపై ప్ర‌తి ఒక్క‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అయితే గ‌త డీజీపీ కేకే మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశాల మేర‌కే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో చ‌ర్చ‌కు దారితీసింది.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ , ఎండీ రాధాకృష్ణ కూడా సిట్ ముందుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి (MP Vishweswar Reddy) విచార‌ణ ముందుకు హాజ‌ర‌య్యారు. ఈ సంర‌ద్బంగా మీడియా ముందు మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ‌ల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని వాపోయారు. త‌న ఫోనుతో పాటు త‌న భార్య ఫోను కూడా ట్యాప్ చేసి బెదిరించార‌ని అన్నారు.

దీంతో త‌ట్టుకోలేక తాను బెంగ‌ళూరుకు పారి పోయాన‌ని బాంబు పేల్చారు. రెండు వారాల పాటు హోట‌ల్ లో త‌ల‌దాచుకున్నాన‌ని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క‌మైన కేసీఆర్, కేటీఆర్ ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. నిందితుల‌కు శిక్ష ప‌డాల్సిందేన‌ని పేర్కొన్నారు.

Also Read : మావోయిస్టుల లేఖ‌పై స్పందించిన సీత‌క్క

Exit mobile version