ఏపీలో రైల్వే ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాలి : సీఎం

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా ఆయ‌న కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్, అమిత్ షా , త‌దిత‌రుల‌ను క‌లిశారు. ఏపీకి సాయం చేయాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే మూడు హై స్పీడ్ రైల్ కారిడార్ల (హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు) ను బడ్జెట్ లో ప్రకటించినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడారు తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని కోరారు అశ్విని వైష్ణ‌వ్ ను. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తర- దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని అన్నారు.
.
ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్ పూర్- చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని సూచించారు. విశాఖ-విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని సూచించారు. తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీసును నడపాలని కోరారు.

Exit mobile version