MP Midhun Reddy Shocking Allegations : జైలులో న‌న్ను ఉగ్ర‌వాది లాగా చూశారు : ఎంపీ

పోలీసుల‌పై మిథున్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Hello Telugu - MP Midhun Reddy Shocking Allegations

Hello Telugu - MP Midhun Reddy Shocking Allegations

MP Midhun Reddy : విజ‌య‌వాడ : ఏపీ మ‌ద్యం పాల‌సీ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పై జైలు నుంచి బ‌య‌ట ప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌ను జైలులో నానా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌ను ఎంపీ అని చూడ‌కుండా ఓ ఉగ్ర‌వాది లాగా ట్రీట్ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జైలు సూప‌రింటెండెంట్ , పోలీసుల‌పై. త‌నపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ వ‌ద్దంటూ ఇప్ప‌టికే కోర్టు ఆదేశాలు జారీ చేసింద‌ని అయినా కావాల‌ని త‌న‌ను టార్చ‌ర్ కు గురి చేశార‌ని వాపోయారు ఎంపీ మిథున్ రెడ్డి (MP Midhun Reddy). త‌ను చిత్తూరు జిల్లా రాజంపేట లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన వైఎస్సార్ పార్టీ నుంచి.

MP Midhun Reddy Key Comments

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో త‌న‌కు ప్ర‌మేయం ఉందంటూ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు సిట్ కూడా ద‌ర్యాప్తు జ‌రిపింది. పూర్తి నివేదిక‌ను స‌మ‌ర్పించింది. పెద్ద ఎత్తున స్కాం చోటు చేసుకుంద‌ని పేర్కొంది. దీంతో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి 73 రోజుల క‌స్ట‌డీ త‌ర్వాత రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అధికార టీడీపీ కూటమి రాజకీయ వేటలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుందని మిధున్ రెడ్డి ఆరోపించారు. అయితే కూట‌మి స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌పై ఎన్ని కేసులు నమోదైనా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానంటూ ప్ర‌క‌టించారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారిని రాకుండా చేశార‌న్నారు.

Also Read : IPS Shivdhar Reddy Growth : తెలంగాణ డీజీపీగా కొలువు తీరిన శివ‌ధ‌ర్ రెడ్డి

Exit mobile version