MP Kiran Kumar Reddy : న్యూఢిల్లీ – తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. లోకసభ సెక్రెటరీ జనరల్‌కు పంపారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy). ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది కేంద్రం. ఆగస్టు 13వ తేదీ వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల వెల్లడించారు. కాన ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు తెలిపారు. సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలని తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
MP Kiran Kumar Reddy Key Comments
కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా రాష్ట్రంలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు వెల్లడించారు. రైతుల డిమాండ్లకు అనుగుణంగా ఎరువులు అందడం లేదన్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. ఆరు నూరైనా సరే వారిని ఆదుకుని తీరుతామన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని పేర్కొన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే యూరియా, మందుల కొరత లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారని చెప్పారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.
Also Read : NCDRC Shocking Comments : వినియోగదారులు మేల్కోండి ఫిర్యాదు చేయండి
