Illegal Surrogacy : హైదరాబాద్ – హైదరాబాద్ లో సృష్టి టెస్టు ట్యూట్ బేబీ అక్రమ సరగోసి వ్యవహారం ఇంకా కొలిక్కి రాక ముందే మరో సరగోసి కేసు వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు ఈ ముఠాను ఛేదించారు. నగరంలో ప్రధానంగా పిల్లలు లేని వారిని టార్గెట్ చేసుకొని రూ.20 లక్షలు వసూలు చేస్తున్నారు తల్లీకొడుకులు. ఈ వ్యవాహారాన్ని బట్ట బయలు చేశారు నగర పోలీసులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్‌బషీరాబాద్ ప్రాంతంలో పేద మహిళలను టార్గెట్ చేసి అండాలు, గర్భానికి వెలకట్టి అక్రమ సరోగసీ (Illegal Surrogacy) దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో కీలకంగా ఉన్న తల్లీ కొడుకులు లక్ష్మీ రెడ్డి (45), నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు మేడ్చల్ పోలీసులు.
Illegal Surrogacy in Hyderabad
ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి భర్తతో విడిపోయి మహారాష్ట్రకు వెళ్లి అండాలు విక్రయించి సరోగసీ ద్వారా డబ్బు సంపాదిస్తూ వస్తోంది. అక్కడ నుండి పిల్లలను ఎత్తుకొచ్చి ఏపీలో విక్రయించడంతో ఆమెను అరెస్టు చేశారు ముంబై పోలీసులు. కాగా జైలు నుండి విడుదలైన అనంతరం హైదరాబాద్‌లోని సుచిత్ర సమీపంలో ఒక భవనం నిర్మించుకొని, జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకును ఏజెంట్‌గా మార్చుకొని అక్రమ దందా కొనసాగిస్తూ వస్తోంది లక్ష్మీ రెడ్డి. హైదరాబాద్ నగరంలోని 6 ఫెర్టిలిటీ సెంటర్లతో అనుబంధం ఏర్పాటు చేసుకొని, ఏజెంట్ల ద్వారా పేద మహిళల అండాలు సేకరించి, సంతానం లేని దంపతుల నుండి రూ.10- 20 లక్షలు వసూలు చేశారు తండ్రీ కొడుకులంటూ పేర్కొన్నారు.
లక్ష్మీరెడ్డి ఇంటికి తరచూ మహిళలు వచ్చి వెళ్తుండడం గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికకులు. ఆమె ఇంటిపై దాడి చేసి గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, రూ.6.47 లక్షల నగదు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని, తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్న మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి ఉమాగౌరీ, మేడ్చల్ ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు.
Also Read : PM Modi – Youth Growth : యువతకు భరోసా కేంద్రం ఆసరా
