MP Gurumurthy : తిరుపతి : వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి (MP Gurumurthy) కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీస్తూ వస్తున్నారు. తాను లేవదీసిన ప్రశ్నలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాజాగా ఆయన చేసిన కృషి ఫలించింది. ఇందులో భాగంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిజీహెచ్ఎస్ ఏర్పాటు కోసం ఎంపీ గురుమూర్తి (MP Gurumurthy) కృషి చేయడం విశేషం. ఎంపీ చేసిన ప్రయత్నం కారణంగా కేంద్ర ప్రభుత్వం సిజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌లు ప్రారంభించేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. గత పార్లమెంటు సమావేశాలలో సిజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్ అందుబాటులో లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.
MP Gurumurthy Request
సిజీహెచ్ఎస్ తక్షణమే ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో సిబ్బంది అనుమతులపై సమీక్ష పూర్తయ్యే వరకు అందుబాటులో ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని లేదా అవసరమైతే అదనపు కాంట్రాక్టు సిబ్బందిని నియమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా నేడు అందుకు అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి వెల్‌నెస్ సెంటర్‌లో ఒక జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఒక ఫార్మసిస్ట్, ఒక జూనియర్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఒక నర్సింగ్ ఆఫీసర్ నియమించనున్నారని పేర్కొన్నారు.
ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేపట్టనున్నారని, భవనాల ఎంపిక పూర్తయిన ప్రదేశాల్లో సెంటర్లను ప్రారంభించడానికి సంబంధిత అదనపు డైరెక్టర్లకు సూచనలు జారీ అయ్యాయని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల నుంచే ఈ వ్యయాన్ని భరించనున్నారని ఎంపీ కార్యాలయానికి సమాచారం అందిందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఎప్పుడో మంజూరైనా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక పోవడం గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Also Read : Pawan Kalyan Important Update : డిప్యూటీ సీఎం సంచలనం సామాన్యుడికి పట్టం
