MP Eatala Rajender Important Update : నాగ‌ర్ కర్నూల్ నుంచి నంద్యాల‌కు వంతెన‌

ప‌రిశీలించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్

Hello Telugu - MP Eatala Rajender Important Update

Hello Telugu - MP Eatala Rajender Important Update

Eatala Rajender : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ (Eatala Rajender) నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా సోమ‌శిల న‌ది మ‌ధ్య‌లో బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని లాంచీలో వెళ్లి పరిశీలించారు. బీజేపీ స‌ర్కార్ వ‌చ్చాక దేశంలో ర‌హ‌దారులు పెద్ద ఎత్తున బాగు ప‌డ్డాయ‌ని చెప్పారు. ప్ర‌ధాని వాజపేయి హయాంలో పీఎంజీఎస్ వై పేరుతో ఊర్లకు డాంబర్ రోడ్లు వచ్చాయన్నారు. భారత మాత పేరిట జాతీయ రహదారులు వేసింది కూడా ఆ మహానాయకుడేన‌ని అన్నారు ఎంపీ. ఆ త‌ర్వాత న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా కొలువు తీరాక దేశంలో మౌలిక వసతులు కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వెల్ల‌డించారు. 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేలు ఉన్నాయో అంతకంటే డబుల్ రోడ్లు ఈ 11 ఏళ్లలో నిర్మాణం జరిగిందని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

MP Eatala Rajender Comments

కొల్లాపూర్ నుంచి బీజేపీ త‌ర‌పున సుధాక‌ర్ రావు 2018లో పోటీ చేసిన స‌మ‌యంలో నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి సంద్యాల వ‌ర‌కు బ్రిడ్జి నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు. ఆయ‌న చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు దేశ ప్ర‌ధాని మోదీ ఓకే చెప్పార‌ని అన్నారు. నాగర్ కర్నూల్ నుండి నంద్యాల వరకు 2 వేల కోట్లతో ఈ ఒడ్డున సోమశిల నుండి ఆ ఒడ్డున నందేశ్వరం వరకు దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జి కి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశార‌ని తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్. మూడు వేల కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ స్వ‌యంగా ఇక్క‌డికి వ‌చ్చి దీనిని మంజూరు చేయించేలా చేశార‌ని తెలిపారు.

Also Read : MLA Padi Kaushik Reddy Strong Demand : హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి

Exit mobile version