MP Eatala Rajender Strong Demand : రైతులు అరిగోస ప‌డుతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

కాంగ్రెస్ స‌ర్కార్ పై మండిప‌డ్డ ఈట‌ల రాజేంద‌ర్

Hello Telugu - MP Eatala Rajender Strong Demand

Hello Telugu - MP Eatala Rajender Strong Demand

Eatala Rajender : క‌రీంన‌గ‌ర్ జిల్లా : ఓ వైపు రైతులు అరిగోస ప‌డుతుంటే బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender). క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించిన ఎంపీ జ‌మ్మికుంట ప‌ట్ట‌ణంలో మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని ఆవేద‌న చెందారు. పంటలు చేతికి వచ్చాయి కానీ కాంటాలు లేవు, మిల్లుల్లో రోజుల తరబడి ధాన్యం దింపుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. క్విటాల్ కి 8కేజీల తరుగు తీస్తున్నారని వాపోయారు ఎంపీ. ఆరుగాలం కష్టపడితే ఈ దోపిడీ ఎందీ అని రైతులు అడుగుతున్నార‌ని దీనికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిపై ఉంద‌న్నారు. సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నార‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు ఈట‌ల రాజేంద‌ర్.

MP Eatala Rajender Key Comments

గ‌తంలో ఇవ్వ‌కుండా మోసం చేశార‌ని, క‌నీసం ఈసారి అయినా ప్రతి రైతుకు అందించాలని కోరారు.
రెండు లక్షల రుణమాఫీ కూడా ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. వర్షాలు పడి వరి మునిగిందన్నారు. భారీ ఎత్తున రైతులు న‌ష్ట పోయార‌ని ఆవేద‌న చెందారు ఈట‌ల రాజేంద‌ర్, తుఫాను మట్టి పాలు చేసింది..
నష్టపోయిన రైతులకు మీరు ప్రకటించిన 10 వేలు వెంటనే ఇవ్వాలాని డిమాండ్ చేశారు. పత్తి విషయంలో కూడా నాన్చకుండా కొనుగోళ్లు చేయాల‌న్నారు. 7 క్వింటాల్ నిబంధన లేకుండా కొనుగోళ్లు చేయాలని కోరారు ఎంపీ. వర్షం వల్ల నష్టపోయి ఉన్నారు కాబట్టి సీసీఐ కూడా నిబంధనలు సడలించాలని సూచించారు. ఫసల్ భీమా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే రైతులకు ఇబ్బంది ఉండేది కాద‌న్నారు.

Also Read : Adluri Laxman – Students Sensational History : చ‌రిత్ర సృష్టించిన తెలంగాణ విద్యార్థులు

Exit mobile version