Adluri Laxman : హైదరాబాద్ : రౌర్కెలా– సుందర్గఢలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్– 2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశ వ్యాప్తంగా ఉన్న EMRS పాఠశాలల మధ్య జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్ షిప్ , ఓవరాల్ టీమ్ ఛాంపియన్ షిప్ , ఓవర్ ఆల్ వ్యక్తిగత ఛాంపియ్ షిప్ ను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని 23 ఈఎంఆర్ఎస్ సంస్థల నుండి 580 మంది విద్యార్థులు, 68 మంది ఎస్కార్ట్ టీచర్లు పాల్గొన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా, బాస్కెట్‌బాల్, ఖో-ఖో తదితర విభాగాల్లో విశేష ప్రతిభను చాటారు. మొత్తం 230 పతకాలు సాధించి రాష్ట్ర ఘనతను చాటారు.
Minister Adluri Laxman Key Comments
ఇంతటి ఘన విజయం సాధించిన తెలంగాణ ఈఎంఆర్ఎస్ విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) సచివాలయంలో తన ఛాంబర్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 230 పతకాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇది తమ సర్కార్ ఇస్తున్న మద్దతుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న నూతన క్రీడా విధానం, EMRSలలో ప్రపంచస్థాయి క్రీడా వాతావరణం సృష్టించడంలో ఒక గొప్ప పాత్ర పోషించిందని అన్నారు. అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, యోగా, స్విమ్మింగ్ వంటి విభాగాల్లో విద్యార్థులు సాధించిన పతకాలు క్రమశిక్షణ, శ్రమ, పట్టుదలకు ప్రతీక అని పేర్కొన్నారు.
Also Read : Telangana Govt Clear Vision : విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు అడ్వైజరీ కమిటీ
