హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. నువ్వు మేధావివి కావొచ్చు, కానీ ప్రజలు దుఃఖిస్తున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ ప్రజానీకాన్ని, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలను మీరు బోనులో నిలబెడుతున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డీ.. బీజేపీ ఏం చేయబోతుందనేది నీకిందికి నీళ్లు వచ్చినప్పుడు తెలుస్తుందని హెచ్చరించారు. ప్రజలకు కోపం వస్తే కేసీఆర్ లాంటి వాడే ఖతం అయ్యిండు, సందర్భం వస్తే పాతాళంలో పాతర వేస్తారని ఈటల ఘాటుగా విమర్శించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనులు చేయించు.. విమర్శలు బంద్ పెట్టు. మనదేశం వ్యవసాయ దేశం. మన ఆదాయం దానిమీద ఆధారపడి ఉంది. 60 శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. నీళ్లు ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడుతారని హితవు పలికారు.
ఉత్తం భేషజాలు బంద్ చెయ్ అంటూ ఘాటుగా విమర్శించారు. భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయండని ఈటల సూచించారు. మీరు చుక్క నీరు నిలవచేయకండి.. నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి అని చెప్తున్నాం.. అర్ధం అవుతుందా రేవంత్ రెడ్డి.. పిచ్చి ఆర్గ్యుమెంట్స్ బంద్ చేయండి. అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ఫిలాసఫీ.. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. నేను తెలంగాణ మట్టిబిడ్డను కాబట్టి తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ గా ఉంటానన్నారు. కాళేశ్వరం అవినీతి బయట పెట్టు, భాధ్యున్ని తేల్చి అరెస్ట్ చేయండి. అంతే తప్ప రాజకీయాలకోసం ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టొద్దు. కాళేశ్వరం కట్టిన డబ్బులు ప్రజలవి. వాటిని వృథా చేయవద్దు. కాళేశ్వరం అవినీతి డబ్బులు రికవరీ చేయండి. మేము అడుగుతుంది నీళ్ళు ఎత్తిపోయండి అంటే.. పిచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
















