MP Eatala Rajender : మల్కాజిగిరి జిల్లా : రాష్ట్రంలో చేపల పెంపకంపై ఆధారపడిన వాళ్లు కోట్లల్లో ఉన్నారని అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender). మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ పెద్దచెరువు లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి ప్రోటీన్ అందించేవి చేపలు అని, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో చేపలను జల పుష్పాలుగా భావిస్తారని చెప్పారు. గతంలో చెరువుల మీద కాంట్రాక్టర్ల పెత్తనం ఉండేదన్నారు. మత్స్యకారులకు చెరువుల మీద అధికారం లేకుండా చేశారని ఆరోపించారు ఎంపీ. మత్స్యకారులు కాంట్రాక్టర్ కి , బ్రోకర్ కి చేపలు పట్టించే కూలీలుగా మాత్రమే పని చేసేవారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వీటికి స్వస్తి పలికి సొంత సొసైటీ మెంబర్లు మాత్రమే చేపలు పట్టుకుని అమ్మాలనే నిబంధన తీసుకు రావడం జరిగిందని చెప్పారు ఈటల రాజేందర్.
MP Eatala Rajender Comments
అనేక మీటింగులు పెట్టిన తర్వాత చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. చేప పిల్లలు, ఫీడ్, మేనేజ్మెంట్, చేపలు పట్టడం, ఐస్ ఫ్యాక్టరీలు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందించడం తో సమగ్ర ప్రణాళికలు తయారు చేయించామన్నారు. అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చానని చెప్పారు ఈటల రాజేందర్. కేజ్ కల్చర్, ఫిషరీస్ ఇండస్ట్రీస్, వాటర్ స్ప్రెడ్ ఏరియాల మీద అవగాహన ఏర్పడిందన్నారు. గొర్ల కాపర్లు, మత్స్యకారులు ఇంకా గ్రామాలను పట్టుకుని ఉంటున్నారని, వారు కూడా అప్ డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ. వలసలు లేకుండా ఉన్న ఊరు మీదనే ఆధారపడి బ్రతికేవారు కాబట్టి వీరికి వృత్తి పరంగా అన్ని రకాల మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : AP Govt Important Update for Cyclone : తుపాను ప్రభావం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం
