AP Govt Important Update for Cyclone : తుపాను ప్ర‌భావం 22 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 20 వేల కోట్ల న‌ష్టమ‌న్న ష‌ర్మిల

Hello Telugu - AP Govt Important Update for Cyclone

Hello Telugu - AP Govt Important Update for Cyclone

AP Govt : అమ‌రావ‌తి : మొంథా తుపాను ప్ర‌భావం కార‌ణంగా చేతికొచ్చిన పంట‌లను రైతులు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). మ‌హా విప‌త్తును సృష్టించింద‌ని వాపోయారు. కోల్పోయిన పంట‌ల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా రైతుల‌తో మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలన్నీ నేలపాలు అయ్యాయ‌ని పేర్కొన్నారు. ఏ రైతుని కదిలించినా కన్నీటి పర్యంతమేన‌ని ఆవేద‌న చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో పర్యటించారు. జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. రైతన్నలతో జరిగిన నష్టంపై చర్చించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మొంథా ప్రభావంతో ఒక్క బంటుమిల్లి మండలంలోనే సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగి నేలకొరిగింద‌న్నారు. రైతన్న ప్రతి ఎకరాకు దాదాపు 35 వేల వరకు పెట్టుబడి పెడితే, పంట చేతికొచ్చి సమయంలో తుఫాను సర్వ నాశనం చేసిందన్నారు.

AP Govt Key Update for Cyclone Impact

రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజక వర్గంలో చూసినా భారీగా జరిగిన నష్టమే కనిపిస్తోందని చెప్పారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా తమ పొలాల్లోకి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, దాదాపు 20 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లితే, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం ఇవ్వలేక నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి కేవలం 8 వందల కోట్లు మాత్రమే నష్టం అని చెప్పడం దారుణం అన్నారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు ష‌ర్మిలా రెడ్డి. జరిగిన నష్టంపై వెంటనే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ అంచనా జరగాలని, నష్ట పోయిన ప్రతి రైతుకి, కౌలు రైతును కూడా కలుపుకొని ఎకరాకు 25 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు విడుదల చేయాలని కోరారు.

Also Read : Megha Sudhakar Reddy Strong Focus : అమెరికన్ కాన్సులేట్ సెక్యూరిటీకి వసతి ఏర్పాటు

Exit mobile version