Eatala Rajender : హైదరాబాద్ : ఉద్యమాలకు పెట్టింది పేరు తెలంగాణ. దేశంలో ఇతర ప్రాంతాలలో కంటే తెలంగాణలోనే చైతన్యం ఎక్కువగా ఉంటుందన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. రిజర్వేషన్లు భిక్ష కాదు అది బీసీల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కోసం బంజారాహిల్స్ లోని కళింగ భవన్ లో జరుగుతున్న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఈటల రాజేందర్ (Eatala Rajender). తెలంగాణ మట్టి ప్రజలు అన్యాయాన్ని సహించరని ప్రకటించారు. జేఏసీ అందరిదిగా ఉండాలని, జేఏసీ పొలిటికల్ లీడర్ నాయకత్వంలో ఉండ కూడదని స్పష్టం చేశారు. నిక్కచ్చిగా నడిపేవారు నాయకత్వం వహించాలని కోరారు ఈటల రాజేందర్. రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాకపోతే సక్సెస్ కాదు అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అందుకే అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలలని కోరారు.
MP Eatala Rajender Slams Congress Govt
తెలంగాణ జేఏసీ కూడా వందల సార్లు ఇచ్చుక పోయేదన్నారు. కానీ ఓపిక పట్టి కలిపి ఉంచామని చెప్పారు ఎంపీ. ఈ వేదిక ఎవరికి వారు పార్టీ ఉపన్యాసాలు ఇచ్చేది కాదు. ఎవరి సిద్దాంతం వారు చెప్పడానికి కూడా కాదు. ఒకటే సిద్ధాంతం ఉండాలని, అది రాజ్యాధికారం సాధించేదిగా ఉండాలని స్పష్టం చేశారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా తెలంగాణలో బీసీ సీఎం ఎందుకు కాలేదని ఆలోచించాలని అన్నారు ఈటల రాజేందర్. ఎక్కువ మందిమి ఉన్నా మనం ఎందుకు కాలేదు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి తప్ప వేరేవారిని దూషించాల్సిన అవసరం లేదన్నారు . మనం వేరే వాళ్ళది అడగడం లేదు మనది మనకు కావాలని అడుగుతున్నామని గుర్తు చేశారు ఎంపీ.
Also Read : Jagadish Reddy Fired on CM Revanth Reddy : రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి
