Jagadish Reddy Fired on CM Revanth Reddy : రేవంత్ రెడ్డి న‌ల్ల‌మ‌ల పులి కాదు పిల్లి

మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్

Hello Telugu - Jagadish Reddy Fired on CM Revanth Reddy

Hello Telugu - Jagadish Reddy Fired on CM Revanth Reddy

Jagadish Reddy : హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి (Jagadish Reddy). ఆయ‌న ప‌దే ప‌దే తాను న‌ల్ల‌మ‌ల పులి అని చెప్పుకుంటాడ‌ని, కానీ పోలీసుల‌ను ప‌క్క‌న పెట్టుకుని తిరుగుతున్న పిల్లి మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. గాజుల రామారంలో హైడ్రా కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని ,పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాల ను పరిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ ఏజెన్సీ లా పని చేస్తుందన్నారు. ఒక పక్కన మూసి ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న హైడ్రా ఆ పక్కకు చూడట్లేద‌ని మండిప‌డ్డారు, కేవలం పేద వాళ్ళ ఇళ్ల మీదనే హైడ్రా ప్రతాపం చూపిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Ex Minister Jagadish Reddy Slams CM Revanth Reddy

బీఆర్ యస్ హయాంలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపిస్తే, ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి హైడ్రా తో కూలగొట్టిన పేదోళ్ల ఇండ్ల శిథిలాలు కనిపిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ యస్ నుండి కొనుక్కున్న ఎమ్మెల్యే గాంధీ గాజులరామారం లో 11 ఎకరాలు కబ్జా చేస్తే ,అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోక పోగా పోలీస్ లతో ఆ ప్రాంతానికి భద్రత క‌ల్పించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. విచిత్రం ఏమిటంటే జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి ఓటు వేయ‌క పోతే పెన్ష‌న్లు ఉండ‌వంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టంచ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఫ్రీ బ‌స్సు ఉండ‌దు, ఫ్రీ రేష‌న్ ఉండ‌ద‌ని చెప్ప‌డం పూర్తిగా భ‌య‌పెట్ట‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. పేద‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేసి గెల‌వాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు జ‌గ‌దీష్ రెడ్డి. తాను బంద్ చేస్తే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌డం ఖాయ‌మ‌ని, త‌రిమి కొట్టే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని తెలుసు కోవాల‌ని అన్నారు.

Also Read : KTR Challenge : తెలంగాణ‌లో రాబోయేది గులాబీ స‌ర్కారే

Exit mobile version