హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో బస్సుల కొరత ఉందని, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు ప్రజా ప్రతినిధులు. ఆయా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఇప్పటికే కొత్త బస్సులు వచ్చాయని నారాయణఖేడ్ , పెద్ద శంకరంపేట లో బస్ స్టేషన్ ల అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి కోరారు. పెద్ద శంకరంపేట లో బస్ స్టేషన్ నుండి బస్సులు నడిపించాలని సూచించారు. రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నుండి కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట లో రాష్ట్రం నలుమూలల నుండి ఆర్టిసి బస్సులు అక్కడికి వస్తాయని పార్కింగ్ కి ఇబ్బంది ఉందని తెలిపారు. హెచ్ఎండిఏ స్థలాన్ని ఉపయోగించుకొని పార్టీ స్థలం తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మించుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని ఎమ్మెల్యే వివేకానంద సూచించారు.
కుత్బుల్లాపూర్ ,దుండిగల్, గండిమైసమ్మ ,బాచుపల్లి నిజాంపేట్ ప్రాంతాల్లోని 2 బీహెచ్ కే కాలనీల వద్ద అత్యధిక రద్దీ ఉందని అక్కడ అదనపు బస్సులు నడపాలని కోరారు. మల్కాజ్గిరి లో రోజువారి కూలీల అధికంగా ఉన్నారని వారికి సరిపడ పర్సనల్ పాలని మచ్చ బొల్లారం- చార్మినార్, మచ్చ బొల్లారం – ఈసీఎల్, మౌలాలి, ఆర్టీసీ కాలనీ ఈసీఎల్, సికింద్రాబాద్ కొత్త రూట్లో బస్సులు నడపాలని సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద బస్టాండ్ జీబీఎస్ బస్ స్టేషన్ ఆధునిక మోడల్ బస్టాండ్ గా నిర్మించాలని ఉత్తర తెలంగాణకు వెళ్లే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ బస్సు ఎక్కడ నుండి నడుస్తాయని మిమ్మల్ని గణేష్ సూచించారు.
బస్ స్టేషన్ ఆధునికరణకు అవసరమైన స్థలాన్ని కంటోన్మెంట్ బోర్డు నుండి తీసుకోవాలని సూచించారు. అన్నా నగర్, తాడ్ బండ్, బాలం రాయి ,బోయిన్పల్లి తూట్లలో అదనకు బస్సులు నడపాలని కోరారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎర్రగడ్డ , బోరబండ నుండి పటాన్చెరువు వివిధ ప్రాంతాలకు ప్రధానమంత్రి బస్సు నడపాలని కోరారు. హైదరాబాద్ కొత్త కాలనీకు కనెక్టివిటీ పెంచాలని విద్యాసంస్థలకు వెళ్ళే రూట్ లలో ఉదయం సాయంత్రం వేళ బస్సులు పెంచాలని కోరారు.
















