CM Chandrababu Important Update : స‌హాయ‌క చర్య‌లు ముమ్మ‌రం చేశాం

ప్ర‌క‌టించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

Hello Telugu - CM Chandrababu Important Update

Hello Telugu - CM Chandrababu Important Update

CM Chandrababu : అమ‌రావ‌తి : ముంథా తుపాను ప్ర‌భావం పెద్ద ఎత్తున ఏపీని అత‌లాకుత‌లం చేసింది. ప్ర‌జా ప్రభుత్వ ల‌క్ష్యం ఒక్క‌టేనని ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌ని అని స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). ఇప్ప‌టికే స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయ‌న్నారు. 1328 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వచ్చే 15 రోజుల్లో ప్రసవాలకు దగ్గరగా ఉన్న 3,465 మంది గర్భిణీలను హాస్పిటళ్ళకు తరలించిన‌ట్లు తెలిపారు. బుధ‌వారం ఆయ‌న తుపాను ప్ర‌భావంపై స‌మీక్ష చేప‌ట్టారు. అన్ని సౌకర్యాలతో 1906 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామ‌న్నారు. మత్స్యకారులను వేటకు వెళ్ళకుండా నిషేధం విధించామ‌ని వెల్ల‌డించారు. 11 ఎన్డీఆర్ఎఫ్‌, 12 ఎస్ఆర్డీఎఫ్ టీంలు సిద్దంగా ఉంచామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. అవసరమైతే ఆర్మీని కూడా వాడుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

CM Chandrababu Key Comments on Montha Cyclone

తుపాను ప్రభావ ప్రాంత ప్రజలకు అత్యవసర సరకుల పంపిణీ చేయాల‌ని ఆదేశించామన్నారు సీఎం.
తుపాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరకులు ఉచితంగా అందించాలని ఆదేశించామ‌న్నారు. మత్స్య కారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళ దుంపలు, కిలో చక్కెర పంపిణీ చేయాల‌ని ఆదేశించామ‌న్నారు. వెంటనే సరకుల పంపిణీ ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు స్ప‌ష్టం చేశారు. ఉల్లిపాయలు, కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్ కు అప్పగించామ‌న్నారు.

Also Read : Hydraa Sensational : పాత‌బ‌స్తీలో చారిత్ర‌క చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌

Exit mobile version