Monsoon : వర్షాకాలం ప్రారంభమవడంతో ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సీజన్‌లో తేమ ఎక్కువగా ఉండటంతో వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉండే ఇళ్లలో మరింత జాగ్రత్త అవసరం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది.
Monsoon Danger Frutis
ఇలాంటి సమయంలో తినే ఆహారం ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, వర్షాకాలంలో (Monsoon) కొన్ని పండ్లను తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో నీటిశాతం అధికంగా ఉండే పండ్లు కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.
వర్షాకాలంలో నివారించాల్సిన పండ్లు:
1. పుచ్చకాయ:
వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చకాయలు వర్షాకాలంలో (Monsoon) మాత్రం జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. నీటి శాతం అధికంగా ఉండటంతో తేమ వాతావరణంలో ఇవి త్వరగా చెడిపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయలను మరుసటి రోజున తినడం మానేయాలి.
2. మామిడి పండ్లు:
వర్షాకాలంలో కూడా మార్కెట్లలో మామిడిపండ్లు కనిపించినా, వీటిలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తినడం ద్వారా జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరిగే అవకాశముంది.
3. లీచీలు:
లీచీ పండ్లు తినడాన్ని అనేక మంది ఇష్టపడతారు. కానీ వర్షాకాలంలో ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.
4. బెర్రీ పండ్లు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ):
ఈ పండ్లు తేమ వాతావరణంలో త్వరగా పాడైపోతాయి. వాడిపోయిన బెర్రీలను తినడం వల్ల జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
మరికొన్ని ముఖ్యమైన సూచనలు:
- పైనాపిల్: కోసిన వెంటనే తినాలి. ఎక్కువసేపు ఉంచితే పుల్లగా మారి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.
- బొప్పాయి: బాగా పండిన తాజా బొప్పాయిని మాత్రమే తినాలి.
- ఫలాలను శుభ్రంగా కడగాలి: వాడే నీటిలో ఉప్పు, వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపి కడగడం మంచిది.
- తినే ముందు తొక్కలు తీయాలి: ఆపిల్, బేరి వంటి పండ్లను తినేటప్పుడు తొక్క తొలగించడం మంచిది.
- తాజాగా కోసిన పండ్లను వెంటనే తినాలి: ఎక్కువసేపు బయట ఉంచిన పండ్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
- సీజనల్ పండ్లను ప్రాధాన్యత ఇవ్వాలి: సీతాఫలం, దానిమ్మ, చెర్రీ, ప్లం వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి మంచివని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలం సవాళ్లతో కూడిన కాలం. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యం దరిచేరదు. పండ్లను ఎంచుకునే విషయంలో సీజనల్, తాజా పండ్లను మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మీ కుటుంబాన్ని రక్షించండి.
Also Read : Vitamin B12 Shocking : విటమిన్ బి12 లోపిస్తే మనిషికి అంత ప్రమాదమా?



















