Mohanlal : న్యూఢిల్లీ : కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. మలయాళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు మోహన్ లాల్ (Mohanlal) కు అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. 2023వ సంవత్సరానికి గాను మోహన్ లాల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. సినిమా రంగానికి చేసిన ఐకానిక్ కృషికి భారతదేశపు అత్యున్నత చలనచిత్ర అవార్డుతో సత్కరించనుంది సర్కార్. ఈ మలయాళ సూపర్ స్టార్ బహుళ భాషలలో 350 కి పైగా చిత్రాలలో నటించారు. సెప్టెంబర్ 23 న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు నటుడు మోహన్ లాల్ కు.
Mohanlal Will Get A Dadasaheb Phalke Award
తను నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. 65 ఏళ్ల మోహన్‌లాల్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ సందర్బంగా కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది తన గురించి. మోహన్‌లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ ప్రమాణాన్ని నెలకొల్పాయని పేర్కొంది. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌తో, మోహన్‌లాల్ మలయాళం, తమిళం, తెలుగు, హిందీ , కన్నడ భాషలలో కీలకమైన పాత్రలు పోషించారు. తను నటించిన మూవీలు తన్మాత్ర, దృశ్యం, వానప్రస్థం, ముంథిరివల్లికల్ తలిర్క్కుంబోల్ , పులిమురుగన్ ఉన్నాయి. అవార్డుకు ఎంపికైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రతిభా నైపుణ్యం కలిగిన నటుడని పేర్కొన్నారు.
Also Read : TVK Vijay Fired on DMK Govt : డీఎంకే సర్కార్ పై భగ్గుమన్న విజయ్
