TVK Vijay Fired on DMK Govt : డీఎంకే స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న విజ‌య్

ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఫైర్

Hello Telugu - TVK Vijay Fired on DMK Govt

Hello Telugu - TVK Vijay Fired on DMK Govt

TVK Vijay : చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (TVK Vijay) నిప్పులు చెరిగారు డీఎంకే స‌ర్కార్ పై. ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రశ్నించారు. కావాల‌ని త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ ల‌పై కూడా సెటైర్స్ వేశారు విజ‌య్. తమిళనాడులో తన రాజకీయ సమావేశాలపై డీఎంకే ప్రభుత్వం కావాల‌ని ఆంక్షలు విధించిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌జాస్వామిక దేశంలో ఏ పార్టీకైనా , ఏ వ్య‌క్తికైనా స‌మావేశం నిర్వ‌హించుకునే ప్రాథ‌మిక హ‌క్కు ఉంటుంద‌ని, ఆ విష‌యం సీఎం ఎంకే స్టాలిన్ మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

TVK Vijay Slams DMK Govt

రాబోయే 2026 సంవ‌త్స‌రంలో మ‌ధ్య జ‌రిగే పోటీ టీవీకే, డీఎంకే మధ్య మాత్రమే అని మ‌రోసారి విజ‌య్ నొక్కి చెప్పారు. అధికార డీఎంకే ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు .త‌న మీటింగ్ ల‌కు ప‌లు రూల్స్ విధిస్తున్న డీఎంకే స‌ర్కార్ ఇదే స‌మ‌యంలో మోదీ, షా టూర్ల‌పై కూడా ఆంక్ష‌లు విధించే ద‌మ్ము, ధైర్యం ఉందా అని ప్ర‌శ్నించారు విజ‌య్. శ‌నివారం త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పుత్తూరులో జరిగిన భారీ ర్యాలీలో ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వం తన స్వేచ్ఛా కదలికను నిరోధించిందని , అధికారాన్ని అంతరాయం కలిగించడానికి కూడా ప్రయత్నించిందని ఫైర్ అయ్యారు. ప్రజలను కలవాలనుకునే నాపై మీరు ఎందుకు షరతులు విధించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : Karnataka Governor Warning to CM : సీఎం సిద్ద‌రామ‌య్యపై గ‌వ‌ర్న‌ర్ గుస్సా

Exit mobile version