Mohammed Siraj Growth : సిరాజ్ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ మంత్ అవార్డ్

ప్ర‌క‌టించిన ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్

Hello Telugu - Mohammed Siraj Growth

Mohammed Siraj : హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కు చెందిన స్టార్ క్రికెట‌ర్, పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ కు అరుదైన అవార్డు ద‌క్కింది. సోమ‌వారం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు ను సిరాజ్ (Mohammed Siraj) కు ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల త‌ను ఆడిన మ్యాచ్ ల‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలో 21.11 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ టూర్ లో స‌త్తా చాటాడు. బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఓడి పోతామ‌ని అనుకున్న స‌మ‌యంలో ఇండియాకు త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. దీంతో ఇండియా, ఇంగ్లండ్ టెస్టు సీరీస్ ను 2-2 తో ముగించేలా చేసింది. స‌మం చేయ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు మొహ్మ‌ద్ సిరాజ్.

Mohammed Siraj Gets Award

ఓవల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై మ్యాచ్ విన్నింగ్ స్పెల్ కు మొహమ్మద్ సిరాజ్ ఆగస్టు 2025 సంవత్సరానికి ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు. ఈ నెలలో అతను పాల్గొన్న ఏకైక మ్యాచ్ ఇదే. రెండు ఇన్నింగ్స్ లలో 21.11 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ తన ప్రయత్నాలకు గాను చివరి టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు, ఇందులో టెస్ట్‌లో 46 ఓవర్లు బౌలింగ్ చేసి రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ నెలవారీ అవార్డు కోసం కుడిచేతి వాటం బౌలర్ న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్‌లను దాటుకుని సిరాజ్ అవార్డుకు ఎంపికైన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది.

Also Read : Speaker Ayyannapatrudu Important Comments : మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం అభివృద్దికి సోపానం

Exit mobile version