సంజూ శాంస‌న్ విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు

మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీ‌కాంత్ కామెంట్

hellotelugu-KrishnamachariSrikanth

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ల నిర్ణ‌యాల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. వారు చెప్పే వివ‌ర‌ణ‌లేవీ త‌నకే కాదు ఎవ‌రినీ ఒప్పించలేక పోతున్నాయ‌ని అన్నారు. ఈ విష‌యంలో పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు మాజీ కెప్టెన్. దేశీవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణించినా, ప‌రుగుల వ‌ర‌ద పారించినా ఎందుక‌ని కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తీసుకోలేద‌ని నిల‌దీశారు. ఇదేనా మీ నిబ‌ద్ద‌త అని ప్ర‌శ్నించారు. క‌డిగి పారేశాడు శ్రీ‌కాంత్. విచిత్రం ఏమిటంటే శాంస‌న్ స్ట్రైక్ రేట్ 183. జ‌ట్టులో ఎవ‌రికైనా ఈ రేట్ ఉందా అని అడిగారు.

వాళ్లు చెప్పే వివ‌ర‌ణ త‌న‌కు మ‌రింత కోపం తెప్పించేలా చేశాయ‌న్నారు. గంభీర్ ఒక మాట చెబితే అగార్క‌ర్ ఇంకోలా ఆన్స‌ర్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నాడు. ఇక ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్లు ఎలా భార‌త జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తారంటూ ఫైర్ అయ్యాడు. ప్ర‌తీసారి ఇది సంజూ శాంసన్, జితేష్ శర్మ మధ్య పోటీ అని అంటున్నారు. వారు చెప్పేదానిలో ఎలాంటి స్పష్టత లేదని భ‌గ్గుమ‌న్నారు. శుభ్ మ‌న్ గిల్ మంచి ఆటగాడని, అందుకే అతనికి అవకాశాలు ఇస్తున్నామని చెబుతుండ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను గ‌త 30 మ్యాచ్ ల‌లో ప‌రుగులు చేసింది కేవ‌లం 263 ర‌న్స్ మాత్ర‌మేన‌ని , ఆ విష‌యం హెడ్ కోచ్, సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ కు తెలియ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇక‌నైనా రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టండి..శాంస‌న్ ను సెలెక్ష‌న్ చేయాల‌ని సూచించాడు క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్.

Exit mobile version