Teenmar Mallanna : హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలనంగా మారారు. తను బీసీల గురించి గత కొంత కాలంగా గొంతు చిచ్చుకున్నాడు. ఆపై స్టార్ హోటల్ లో బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేస్తూ బీసీ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశాడు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ చేపట్టారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్నారు. బీసీ బంద్ కు తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. మరో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు. ఈ తరుణంలో క్యూ న్యూస్ ఛానల్ వేదికగా ఎమ్మెల్సీ మల్లన్న (Teenmar Mallanna), తనతో పాటే పని చేసే సుదర్శన్ సైతం బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Teenmar Mallanna Shocking Comments
బీసీ బందులో బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్పీఎస్ చీఫ్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ నెల్లికొండి సత్యం, టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు. మరో వైపు మాజీ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు మాజీ సీనియర్ ఐఏఎస్ చిరంజీవులు హాజరయ్యారు. ఈ సమయంలో ఎంతో ఆవేశంతో బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చిన సుదర్శన్, తీన్మార్ మల్లన్నలు పార్టీ పరంగా , నేతలు బీసీ బంద్ లో పాల్గొనక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే మల్లన్న తన ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం లోని మల్లన్నను దర్శించు కోవడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : CM Chandrababu Clear Instructions : విశాఖ సీఐఐ సదస్సును సక్సెస్ చేయాలి
