Mohammad Azharuddin Sensational : మ‌హమ్మ‌ద్ అజారుద్దీన్ బ‌న్ గ‌యా మినిష్ట‌ర్

గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏఐసీసీ హైక‌మాండ్

Hello Telugu - Mohammad Azharuddin Sensational

Hello Telugu - Mohammad Azharuddin Sensational

Mohammad Azharuddin : హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఏఐసీసీ హైక‌మాండ్. ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి పోయారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌తానంటూ ప్ర‌క‌టించారు. కానీ త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు. రౌడీ షీట‌ర్ గా పేరు పొందిన న‌వీన్ యాద‌వ్ కు క‌ట్ట‌బెట్టింది. తీరా హైక‌మాండ్ ఊహించ‌ని విధంగా త‌న‌కు ఎమ్మెల్సీ కోటాలో చోటు క‌ల్పించింది. ఇప్ప‌టి వ‌ర‌కు కొలువు తీరిన మంత్రివ‌ర్గంలో మైనార్టీల‌కు ఎలాంటి చోటు క‌ల్పించ‌లేదు. దీంతో మైనార్టీల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. మ‌రో వైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన ష‌బ్బీర్ అలీకి ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కంటే హైక‌మాండ్ తో ప్ర‌ధానంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌తో ఎక్కువ‌గా స‌త్ సంబంధాలు ఉన్నాయి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) కు.

Mohammad Azharuddin to be a Minister?

ఇదిలా ఉండ‌గా త‌న‌కు తాజాగా కేబినెట్ లో చోటు క‌ల్పించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రాబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టాక్. ప్ర‌స్తుతం అజారుద్దీన్ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. గ‌తంలో త‌ను కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీగా గెలుపొందాడు. ఆ త‌ర్వాత ఓడి పోయాడు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ గా ప‌ని చేశాడు. త‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టు కోదండరామ్ , అమీర్ అలీ ఖాన్‌ల నామినేష‌న్ల‌ను కొట్టి వేసింది. దీంతో అజారుద్దీన్ ను గవ‌ర్న‌ర్ కోటా కింద శాస‌న మండ‌లికి నామినేట్ చేశారు. త‌ను గ‌నుక ప్ర‌మాణ స్వీకారం చేస్తే మంత్రుల సంఖ్య 16కి చేరుతుంది.

Also Read : CM Revanth Reddy Clear Instructions : తుపాను ప్ర‌భావంతో అప్ర‌మ‌త్తంగా ఉండండి

Exit mobile version