డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్న మోదీ

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఏషియ‌న్ స‌ద‌స్సు

hellotelugu-pmmodi

ఢిల్లీ : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీక‌రించ లేదు. అయితే త్వ‌ర‌లోనే ఆసియా స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ కీల‌క స‌ద‌స్సుకు ప్ర‌పంచాధినేత‌లు హాజ‌రు కానున్నారు. ఇందుకు సంబంధంచి త‌న‌ను రావాలంటూ ప్ర‌ధానికి ఆహ్వానం అందింది. ఈ కీల‌క స‌మ్మిట్ మ‌లేషియా వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. దీంతో ప్ర‌ధాన‌మంత్రి అన్వ‌ర్ ఇబ్ర‌హీం ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీతో పాటు డొనాల్డ్ ట్రంప్ కు కూడా రావాల‌ని కోరుతూ ఇన్విటేష‌న్ పంపించారు. ఇక ఒక‌వేళ‌ అమెరికా దేశాధినేత త‌న‌ భాగస్వామ్యాన్ని ధృవీకరిస్తే ఈనెల 26 లేదా 27 తేదీలలో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియ‌న్ సమ్మిట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

మ‌రో వైపు ఆసియా స‌మావేశంతో పాటు ఆసియా – ఇండియా స‌మ్మిట్ కు కూడా ప్ర‌ధాని హాజ‌ర‌వుతారు.
ఇదిలా ఉండ‌గా ట్రంప్ తన రెండవ పదవీకాలం ప్రారంభించిన కొద్దిసేపటికే మోడీ అమెరికాను సందర్శించిన ఫిబ్రవరి తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది ​​మొదటిది అవుతుంది. ఆగస్టులో భారత ఎగుమతులపై వాషింగ్టన్ 50 శాతం సుంకాలను విధించడంతో, వీటిలో సగం రష్యా చమురు దిగుమతి కోసం భారతదేశంపై ఆంక్షలు విధించడంతో సంబంధాలు దెబ్బ తిన్నాయి. కాగా ఘర్షణ ఉన్నప్పటికీ గాజా వివాదాన్ని ముగించడానికి ట్రంప్ పశ్చిమ ఆసియా శాంతి ప్రణాళికకు మోడీ ఇటీవల మద్దతు పలికారు. దీనిపై స్పందించారు ట్రంప్. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు ఆచరణీయమైన మార్గం అని అభిప్రాయ‌ప‌డ్డారు.

Exit mobile version