Modi : టియాంజిన్ – భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన జపాన్ లో పర్యటించారు. కీలక అంశాలపై చర్చించారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో సుదీర్ఘ కాలం తర్వాత అంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ (Modi) చైనాపై కాలు మోపారు . ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు మోదీ. వీరి మధ్య స్నేహ పూర్వకమైన సంబంధం కొనసాగడం విశేషం. ఇరు దేశాల మధ్య మరింత సంబంధాలను బలోపేతం చేసుకోవాలని మోదీ, జిన్ పింగ్ లు ప్రకటించారు. దీంతో అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
Modi-Putin Meeting
తాజాగా సోమవారం మరో కీలకమైన సన్నివేశానికి వేదికైంది షాంగై ఆర్థిక సదస్సు. పలు దేశాలు ఇందులో పాల్గొన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. వీరు చాలా మంచి మిత్రులు. దీనిని స్వాగతించ లేక పోతోంది అమెరికా. ఈ మేరకు భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అయినా భారత దేశం భయపడేది లేదంటూ ప్రకటించారు మోదీ. దీనికి కారణం ఇండియా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ ను కొనుగోలు చేస్తోంది. దీనిని నిలిపి వేయాలని అంటోంది అమెరికా. ఈ తరుణంలో పుతిన్ తో స్పెషల్ గా భేటీ కావడం కలకలం రేపుతోంది.
Also Read : KTR Fired on CM Revanth Reddy : సీఎం నిర్ణయం కేటీఆర్ ఆగ్రహం
