MLC Nagababu Alarming : ఏటికొప్పాక బొమ్మ‌ల‌కు గ‌ర్తింపు తీసుకొస్తాం

పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు వెల్ల‌డి

Hello Telugu - MLC Nagababu Alarming

Hello Telugu - MLC Nagababu Alarming

MLC Nagababu : అమ‌రావ‌తి – ప్ర‌పంచ వ్యాప్తంగా ఏపీలో త‌యారు చేసే ఏటికొప్పాక బొమ్మ‌ల‌కు మార్కెట్ ప‌రంగా గుర్తింపు తీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తామ‌ని అన్నారు జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ నాగ‌బాబు కొణిద‌ల‌ (MLC Nagababu). ఆయ‌న‌ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన్ స్టేషన్-వన్ ప్రోడక్ట్ ప‌థ‌కంలో భాగంగా సెర్ప్ విభాగం ఆధ్వ‌ర్యంలో పిఠాపురంలో ఏటికొప్పాక బొమ్మలతో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ ను నాగ‌బాబు ప్రారంభించారు. వీర మహిళ పిల్లా రమ్య జ్యోతి ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఏర్పాటైంది.

MLC Nagababu Key Comments

పిఠాపురం పట్టణం ఇందిరానగర్ లో జనసేన వీరమహిళ పిట్ట ముని ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నేపథ్యంలో స్థానిక జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ సహకారంతో పునర్నిర్మించిన ఆ ఇంటిని నాగబాబు గారు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జగ్గయ్య చెరువు కాలనీ పాత సచివాలయం దగ్గర జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త‌న‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఫెర్టిలైజర్ డ్రోన్ పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ ఆధారిత పనుల కోసం ఉపయోగించే ఫెర్టిలైజర్ డ్రోన్ పని చేసే విధానాన్ని పిఠాపురంలో శిక్షణ పొందిన యువకులను నాగబాబు అడిగి తెలుసుకున్నారు.

ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను, పంటల సంరక్షణ తదితర వివరాలను వాకబు చేశారు.
పిఠాపురం నియోజకవర్గం జ‌న‌సేన పార్టీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, గోదావరి తూర్పు ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి ప్రకాష్, ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట నాని బాబు, పిఠాపురం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చల్లబోయిన ప్రమీల నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, చల్లా లక్ష్మి , తలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన సతీష్ కుమార్, లాజర్ బాబు, మత్స అప్పాజీ, పిల్లా శివ, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

Also Read : Somireddy Fired on BRS Party : బనకచర్ల ప్రాజెక్టుపై అంత ద్వేషం ఎందుకు..?

Exit mobile version