K Kavitha Fired on Congress Govt : అరిగోస ప‌డుతున్న అన్న‌దాత‌లు : క‌విత

కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్

Hello Telugu - K Kavitha Fired on Congress Govt

Hello Telugu - K Kavitha Fired on Congress Govt

Kavitha : హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు , ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (Kavitha). కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలు అరిగోస పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నర‌ని ఆరోపించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని మోసం చేశారంటూ మండిప‌డ్డారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కన్నా రూ.400 తక్కువకు మక్కలు కొనుగోలు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. దీన్ని బ‌ట్టి చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

Kavitha Slams Congress Govt

రైతుభరోసా, రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక పోయిందన్నారు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయలే కపోతోంది. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల వ్యథలు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ స‌ర్కార్ నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆరుగాలం శ్ర‌మించే అన్న‌దాత‌ల‌ను ఇలాగేనా ఇబ్బంది పెట్టేదంటూ మండిప‌డ్డారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తక్ష‌ణ‌మే కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : America Gives Huge Relief : అమెరికాలో చదువుకునే విద్యార్థులకు బిగ్ రిలీఫ్

Exit mobile version