నల్లగొండ్ జిల్లా : అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు. నిప్పులు చెరిగాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియజకవర్గానికి రూ. 9 వేల కోట్లు మంజూరు చేస్తే ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఒక రకంగా నిలదీశారు. నిప్పులు చెరిగాడు. దమ్ముంటే , ధైర్యం ఉంటే తనను తాకి చూడాలని సవాల్ విసిరాడు. నీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని సంచలన ప్రకటన చేశాడు రాజగోపాల్ రెడ్డి. సరైన సమయం వచ్చినప్పుడు, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డికి.
రేవంత్ రాష్ట్రాన్ని ఎలా దోచుకుంటున్నాడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు… ఇలా ప్రతి అంశంపై నా దగ్గర సమాచారం ఉందంటూ బాంబు పేల్చాడు ఎమ్మెల్యే.
రేవంత్ రెడ్డి ఎవరికీ తెలియకుండా గోవాకు ఎందుకు వెళ్తున్నాడు, ఆ పర్యటనల వెనుక ఉన్న కారణాలేంటి…? వీటికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. సరైన సమయంలో, ఆ వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచుతాననని స్పష్టం చేశాడు.నేను వాస్తవాలు మాట్లాడినప్పుడు, వాటికి సమాధానం చెప్పే బదులు.. నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఇది తగదన్నాడు. సోషల్ మీడియాలో డబ్బు ఇచ్చి మనుషులతో నన్ను తిట్టిస్తున్నారని వాపోయాడు.
బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే రకం నేను కాదన్నాడు. నన్ను దూషించినంత మాత్రాన నిజం ఆగిపోదన్నాడు. సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ప్రశ్నలను అణచి వేయలేరని పేర్కొన్నాడు. సమయం వచ్చినప్పుడు, నా దగ్గర ఉన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచుతానని, అప్పటి వరకు వేచి చూడాలన్నాడు.
